ఆర్జివి మొదలు పెట్టిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మొదటి నుండి సంచలనంగా మారింది. ఓపెనింగ్ రోజు నుండి టీజర్, ట్రైలర్ ఇలా అన్నిటా సంచలనాలకు కేంద్ర బిందువుగా అయ్యింది లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. లక్ష్మీ పార్వతి వచ్చాక ఎన్.టి.ఆర్ జీవితంలో జరిగిన మార్పులు ఆయన చరమాంకంలో పడిన బాధలను ఈ సినిమాలో చూపిస్తున్నామని అన్నాడు వర్మ. అంతేకాదు ఎన్.టి.ఆర్ జీవితంలో చేదు నిజాలను బయట పెట్టేలా ఈ సినిమా వస్తుంది.
అందుకే లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ట్రైలర్ 7 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 14న రిలీజైన ఈ ట్రైలర్ తక్కువ టైంలో ఇన్ని వ్యూస్ సాధించడం చూస్తుంటే ఎన్.టి.ఆర్ అసలు కథ తెలుసుకోవాలని వీరంగా వెయిట్ చేస్తున్నారని అనుకోవచ్చు. యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో 3వ స్థానంలో ఉన్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ట్రైలర్ మొన్న రిలీజైన ఎన్.టి.ఆర్ మహానాయకుడు ట్రైలర్ మాత్రం యూట్యూబ్ లో పెద్దగా సందడి చేయట్లేదు.
ఇదంతా చూస్తుంటే వర్మ చెప్పినట్టుగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ కే ఎన్.టి.ఆర్ ఆశీస్సులు ఉన్నాయని చెప్పడం నిజమే అనిపిస్తుంది. మహానాయకుడు ఫిబ్రవరి 22న వస్తుండగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మాత్రం రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదు.