నాగబాబు అలా.. చిరంజీవి ఇలా.. మెగా బ్రదర్స్ కవర్ డ్రైవ్..!

-

ఓ పక్క మెగా బ్రదర్ నాగబాబు తన మాటలతో నందమూరి బాలకృష్ణను డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ గా వాయిస్తుంటే మరో పక్క చిరంజీవి మాత్రం ఇవేవి పట్టనట్టుగా ఉంటున్నాడు. అటు అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇద్దరి బాధ్యతను మీద వేసుకున్న నాగబాబు ఆమధ్య బాలకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలు ఏ రేంజ్ లో సంచలనంగా మారాయో తెలిసిందే. నాగబాబు కామెంట్స్ కు బాలయ్య ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో అని అంతా ఎదురుచూశారు కాని ఇప్పటివరకు అసలు ఆ కామెంట్స్ కు రిప్లై ఇవ్వలేదు.

ఇదిలాఉంటే ఆదివారం వైజాగ్ లో జరిగిన టి.వి9-టి.ఎస్.ఆర్ నేషనల్ అవార్డ్స్ లో భాగంగా బాలకృష్ణ గురించి మాట్లాడాడు చిరంజీవి. తమని అన్నదమ్ముల బంధమన్నట్టుగా మాట్లాడాడు చిరు. మేం మంచి స్నేహితులం మీకు ఈ విషయం తెలియచేసేందుకు ఇది చక్కని సందేశం. అభిమానులు కూడా ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా ఉండేందుకు ఇది దోహదం చేస్తుందని అన్నారు. ఇక తనకు ఎలాంటి అవార్డు రాలేదని నవ్వుతూ అన్న చిరు తనయుడి సక్సెస్ ను అనుభవిస్తున్నా అన్నారు. నాగబాబు ఫైర్ అవుతుంటే.. చిరు మాత్రం కూల్ గా కవర్ చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news