మేజర్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్.. అభిమానులకు పండగే..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలకు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ లో రూపొందుతున్న మేజర్ సినిమా 26 /11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతోంది. ఇక ఇందులో ప్రధాన పాత్రలో అడవి శేషు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే జూన్ 3వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కు సంబంధించి ఇటీవల ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ కూడా లభించింది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో బిగ్గెస్ట్ అప్డేట్ ఒకటి మన ముందుకు రావడం గమనార్హం.

అదేమిటంటే ఈ సినిమా అనుకున్న దాని కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మే 24వ తేదీ నుంచి ఫ్రీ రిలీజ్ ఫిలిం స్క్రీనింగ్ పేరుతో మేజర్ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రం మేకర్స్ వెల్లడించడం గమనార్హం . ఇకపోతే బుక్ మై షో లో రిలీజ్ టికెట్లు అందుబాటులో ఉంటాయని కూడా స్పష్టం చేశారు. ఫ్రీ రిలీజ్ స్క్రీనింగ్ అంటే ఒకటి రెండు రోజులు విడుదలకు ముందు నుంచి ఉంటాయి కానీ ఈ సినిమా విషయంలో మాత్రం పది రోజులు ముందుగానే స్క్రీనింగ్ చేయబోతున్నారు.

ఇక ఈ సినిమాను మహేష్ బాబుతో పాటు సోనీ పిక్చర్స్ అలాగే ఏ ప్లస్ ఎస్ మూవీస్ వాళ్ళు కలిసి నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాకి అబ్బూరి రవి మాటలు రాయగా శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించనున్నారు. ఇకపోతే తెలుగు , హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేశారు ప్రకాష్రాజ్ మురళీశర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి అయితే విడుదలకు ముందే ఈ సినిమాను చూడవచ్చు అని అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.