నోరుజారి చంద్రముఖి సీక్వెల్ లో అసలు ట్విస్ట్ బయట పెట్టేసిన లారెన్స్..!

-

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చంద్రముఖి చిత్రం ఎంత ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఆ సినిమాను అభిమానులు మరచిపోలేరు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రాఘవ లారెన్స్ ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నోరుజారి సినిమాలో అసలు విషయాన్ని బయట పెట్టేసాడు ఈ హీరో..

చంద్రముఖి చిత్రాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు. తమిళంతో పాటు తెలుగులో ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే.. ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా సీక్వెల్లో ప్రస్తుతం లారెన్స్ కంగనా రాధిక శరత్ కుమార్, లక్ష్మి మీనన్, వడివేలు. ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మైసూర్లో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ పనులు శర వేగంగా జరిగాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.

తాజాగా లారెన్స్ నటించిన మరో చిత్రం రుద్రుడు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా తన తర్వాతి సినిమాల గురించి మాట్లాడాడు రాఘవ లారెన్స్. ఈ నేపథ్యంలో ఓ మీడియా ప్రతినిధి చంద్రముఖి గురించి డిఫరెంట్ గా ప్రశ్న అడిగాడు. ఆ సినిమాలో పాము వెళ్లిపోవడంతో ఎండ్ చేశారు.. కదా మరి దానికి కంటిన్యూ చంద్రముఖి 2 సినిమాలో ఉంటుందా.. అసలు ఆ పామును ఈసినిమాలో చూపిస్తారా అని ప్రశ్నించగా.. లారెన్స్ సమాధానమిస్తూ.. అది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ ఆ పాముకు.. ఈ కథకు ముగింపు చంద్రముఖి 3లో ఉంటుంది అని అన్నారు. దీంతో చంద్రముఖి 3 కూడా ఉండబోతున్నట్టు దాదాపు క్లారిటీ ఇచ్చేశారు లారెన్స్.

Read more RELATED
Recommended to you

Latest news