ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ బాంబు పేల్చ‌నున్న వ‌ర్మ‌..!

-

ఎల్లప్పుడూ వివాదాల‌కు కేరాఫ్‌గా నిలిచే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం విదిత‌మే. ల‌క్ష్మీపార్వ‌తి, ఎన్టీఆర్‌ల మ‌ధ్య ఉన్న అనుబంధ‌మే ప్ర‌ధాన క‌థాంశంగా తీసుకుని వ‌ర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి వ‌ర్మ ఇప్ప‌టికే ప‌లు పాట‌లు, పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేసి సంచ‌ల‌నం సృష్టించారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో ఈ సినిమాకు చెందిన ట్రైల‌ర్ ను కూడా విడుద‌ల చేయ‌నున్నారు.

దర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్‌టీఆర్ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ను ఈ నెల 14వ తేదీ వాలెంటైన్స్ డే రోజున ఉద‌యం 9.27 గంట‌ల‌కు విడుద‌ల చేయనున్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్‌లో విష‌యాన్ని వెల్ల‌డించారు. చిత్ర నిర్మాణ సంస్థ జీవీ ఫిలింస్ ట్రైల‌ర్‌ను లాంచ్ చేయ‌నుంది. అయితే ఈ ల‌క్ష్మీస్ ఎన్‌టీఆర్ ట్రైల‌ర్‌ను మ‌హానాయ‌కుడు సినిమా విడుద‌ల తేదీ ప్ర‌క‌టించిన రోజునే విడుద‌ల చేస్తాన‌ని వ‌ర్మ గ‌తంలో ప్ర‌క‌టించారు. అయిన‌ప్ప‌టికీ ట్రైల‌ర్‌ను మాత్రం ముందే విడుద‌ల చేస్తున్నారు.

ల‌క్ష్మీస్ ఎన్‌టీఆర్ చిత్రం ద్వారా ఎన్‌టీఆర్ జీవితంలో జరిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల‌కు చెందిన అస‌లు క‌థ ప్రేక్ష‌కుల‌కు తెలుస్తుంద‌ని, కృత‌జ్ఞ‌త‌, విశ్వాసం లేని కుటుంబ స‌భ్యులు, వెన్నుపోటు పొడిచి మోసం చేసిన వారు, ల‌క్ష్మీపార్వ‌తి.. త‌దిత‌ర వ్య‌క్తుల‌కు చెందిన అస‌లు క‌థ‌లు ఈ చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల‌కు తెలుస్తాయ‌ని వ‌ర్మ అన్నారు. కాగా ఈ సినిమాలో ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌లో యజ్ఞాశెట్టి న‌టిస్తుండ‌గా, ఎన్టీఆర్ పాత్ర‌లో ఓ రంగ స్థ‌ల న‌టుడు నటిస్తున్నారు. అలాగే వంగ‌వీటి సినిమాలో దేవినేని నెహ్రూ పాత్ర‌లో న‌టించిన శ్రీ‌తేజ్ ఈ సినిమాలో చంద్ర‌బాబు పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. క‌ల్యాణి మాలిక్ ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version