ప్రముఖ కమెడియన్ మనోబాల కన్నుమూత

-

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ డైరెక్టర్, కమెడియన్ మనోబాల (69) కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కాసేపటి క్రితమే మరణించారు. లివర్ సమస్యలతో ఆయన తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఆయన మరణం సినీ పరిశ్రమతో పాటు అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇండస్ట్రీలో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. జనవరిలో యాంజియో చికిత్స చేయించుకున్నారు.

 

అప్పటినుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మనోబాల బుధవారం మరణించారు. ఎన్నో తమిళ సూపర్ హిట్ సినిమాలలో నవ్వులు పూజించిన మనోబాల ఇప్పుడు అందరినీ కన్నీళ్ళలో ముంచేశారని అభిమానులు బాధపడుతున్నారు. మనోబాల చంద్రముఖి, గజిని, సింగం, కాంచన, భవాని, లింగ, తుపాకీ, రాజారాణి తదితర చిత్రాలలో నటించారు. ఆయన నటనతో పాటు దర్శకత్వం, ప్రొడ్యూసర్ గాను పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news