మొలకెత్తిన వీటితో బోలెడు ప్రయోజనాలు.. ఆ సమస్యలు వెంటనే తగ్గుతాయి..

-

ఎండాకాలంలో ఎన్నో సమస్య వస్తాయి..వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలేకాక జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సమస్యల నుంచి బయట పడడానికి ఉల్లిపాయ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.. ఉల్లిపాయలతో కలిగే ఆరోగ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఉల్లిపాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’ అంటుంటారు పెద్దలు. ఇక ఉల్లిపాయ వేసవి కాలంలో వడదెబ్బ, డీహైడ్రేషన్‌ను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా బ్యూటీ కేర్ రొటీన్‌, జుట్టు సంరక్షణలోనూ ఉపయోగిస్తుంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఉల్లిపాయతోనే కాదు, మొలకెత్తిన ఉల్లిపాయలు కూడా ఎన్నో విధాలుగా ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. సాధారణంగా పెద్దమొత్తంలో ఉల్లిపాయలను కొని వంటగదిలో చాలా రోజులు ఉంచితే మొలకలు వస్తాయి. అయితే ఎక్కువ మంది ప్రజలు మొలకెత్తిన ఉల్లిపాయలను పక్కనపెట్టేస్తారు. కానీ వీటిని ఉపయోగించడం ఎంత ప్రయోజనకరమో.. మరి ఆ ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు చూద్దాం..

మొలకెత్తిన ఉల్లిపాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల అది శరీరంలోని లోపాన్ని తొలగిస్తుంది. అలాగే శరీర రోగనిరోధక వ్యవస్థ, జుట్టు, చర్మ సంరక్షణలో ఉపయోగకరంగా ఉంటుంది…అలాగే మొలకెత్తిన ఉల్లిపాయల్లో క్యాల్షియం, ఫాస్పరస్ వంటి పలు రకాల మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన దంతాలు, ఎముకలను దృఢంగా ఉంచడంలో ఎంతగానో ఉపకరిస్తాయి..ఇంకా మొలకెత్తిన ఉల్లిపాయలలో అధిక మొత్తంలో ఫైబర్ ఉన్నందున జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా కడుపు సంబంధిత సమస్యలు కూడా దూరంగా ఉంటాయి.. అదే విధంగా వేసవి కాలంలో ప్రజలు మొలకెత్తిన ఉల్లిపాయలను తింటే శరీరంలోని వేడి తగ్గడంతో పాటు పొట్ట చల్లగా ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news