ఘనంగా విజయ్ దేవరకొండ-శ్రీలీల సినిమా పూజా కార్యక్రమం.. ఫొటోలు వైరల్

-

లైగర్ ఫ్లాప్​తో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే సమంతతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ హీరో జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్​లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల జంటగా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్​లో ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాలో విజయ్‌ గూఢాచారిగా కనిపించనున్నట్లు సమాచారం. నాలుగు నెలల క్రితం మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్‌ సినిమాపై ఎక్కడలేని హైప్‌ తీసుకొచ్చింది. పోలీస్‌ డ్రెస్‌లో ముఖానికి ముసుగు ధరించిన పోస్టర్‌ అప్పుడు నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. అంతేకాకుండా నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియదు అంటూ పోస్టర్‌పై ఓ క్యాప్షన్‌ను ఇచ్చి ప్రేక్షకుల్లో తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్‌ చేశారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైనమెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్డూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news