“LIKE SHARE SUBSCRIBE” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

-

విభిన్న కథలను ఎంచుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు నటుడు సంతోష్ శోభన్. ” గోల్కొండ హై స్కూల్” చిత్రంతో గౌతమ్ గా కెరియర్ ని ప్రారంభించాడు సంతోష్. ” తను నేను” అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఏక్ మినీ కధ చిత్రంతో మొదటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం మేర్లపాటి గాంధీ దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ” లైక్ షేర్ సబ్స్క్రయిబ్”. ఈ టైటిల్ ని ప్రకటిస్తూ చిత్ర బృందం పోస్టర్ ను రివిల్ చేసింది.

టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా సోమవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో జాతీ రత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. అడ్వెంచరస్ ట్రావెల్ ఎంటర్టైనర్ గా తెరకేక్కుతున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, కమెడియన్ సుదర్శన్ పైకి చూస్తూ కనిపిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news