ఒక్కొక్కసారి మనకి జీవితంలో కాస్త రిలీఫ్ ఉండాలని ఏదైనా టూర్ కి వెళ్లాలని అనుకుంటున్నాము. పైగా కాస్త రొటీన్ కి దూరంగా ఉండాలని చాలా మంది టూర్లు వేయాలి అనుకుంటారు. మీరు కూడా ఏదైనా టూర్ ని సెప్టెంబర్ నెలలో వేయాలి అనుకుంటున్నారా..?
అయితే తప్పకుండా ఈ ప్రదేశాలని చూడాల్సిందే. వర్షాకాలం లో ఈ ప్రదేశాలు చాలా బాగుంటాయి. పైగా మీరు ఎంతో ఎంజాయ్ చేయడానికి అవుతుంది. మరి ఆ ప్రదేశాల గురించి ఇప్పుడు చూద్దాం.
ఊటీ తమిళ్ నాడు :
ఊటీ ని చూడడానికి చాలా బాగుంటుంది. సముద్ర మట్టానికి 2240 మీటర్ల ఎత్తులో ఉంటుందిది. అందమైన ప్రకృతి ఎంతగానో ఆకట్టుకుంటుంది. పైగా ఇక్కడ వుండే పచ్చని పరిసరాలు, స్వచ్ఛమైన గాలి ఎంతో ఆకర్షణీయం ఉంటాయి. అదే విధంగా సరస్సులు, తోటలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మదుమలై నేషనల్ పార్క్, పైకారా జలపాతాలు ఇలా ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ వున్నాయి. హెక్కింగ్, ట్రెక్కింగ్ ఇలా ఎన్నో వాటికి అనుకూలంగా ఉంటుంది ఈ ప్రదేశం. కనుక సెప్టెంబర్ లో ఊటీ వెళ్ళొచ్చేయండి.
కోవలం కేరళ:
సెప్టెంబర్ నెలలో ఈ ప్రదేశం చూడడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఒకవైపు సముద్రం, మరొకవైపు పచ్చని భూభాగాలతో ఎంతో అందంగా ఉంటుంది ఈ ప్రాంతం. కోవలంలో హవా బీచ్ బాగా ఆకట్టుకుంటుంది.
కాలింపాంగ్ పశ్చిమ బెంగాల్ :
సెప్టెంబర్ నెలలో ఈ ప్రదేశం చూడడానికి కూడా బాగుంటుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హిల్ టౌన్ కాలింపాంగ్ టూర్ వేస్తె మరచిపోలేరు. విశాలమైన లోయ ప్రాంతాలు, బౌద్ధ ఆరామాలు, చర్చిలు ఇలా ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ వున్నాయి. కొలొనియల్ ఎరా నాటి భవనాలను కూడా ఇక్కడ చూడచ్చు. అలానే టిబెటన్ హస్తకళలకు ప్రసిద్ధి గాంచిన కాలింపాంగ్ ని కూడా చుట్టేయచ్చు.
జిరో అరుణాచల్ ప్రదేశ్ :
మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది. కనుక సంగీతం అంటే ఇష్టం అయ్యేవాళ్ళు దీన్ని చూడడానికి ప్లాన్ చేసుకోండి. వరి పొలాలు, దట్టమైన వెదురు అడవులతో ఈ ప్రాంతం ఎంతో అందంగా ఉంటుంది.