లావుగా ఉన్నాడని లవర్‌ బ్రేకప్‌ చెప్పింది.. అంతే దిమ్మతిరిగే షాకిచ్చాడు..! ఏకంగా 70కిలోలు..

-

లావుగా అవడం మాత్రమే మన చేతుల్లో ఉంది.. తగ్గడం మన చేతుల్లో లేని పని చాలామంది అనుకుంటారు. కానీ గట్టిగా అనుకుంటే కానిది ఏం ఉండదు. తాజాగా బాగా లావుగా ఉన్నాడని ఓ యువకుడికి అతని గర్ల్‌ఫ్రెండ్‌ బ్రేకప్ చెప్పేసింది. అతని వెయిట్‌ 139 కేజీలు ఉండేది. ప్రియురాలు హ్యాండ్‌ ఇవ్వడంతో.. ఆ యువకుడు చాలా కుంగిపోయాడట. నచ్చచెప్పాలని ఎంత ప్రయత్నించినా లాభం లేదు. అప్పుడే ఫిక్స్‌ అయ్యాడు.. బరువు తగ్గాలని.
ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా తమ దినచర్యలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. బరువు తక్కువగా ఉన్నవారితో పోలిస్తే యాక్టివ్ గా ఉండకపోవడం, బట్టలు సరిగ్గా అమర్చకపోవడం, త్వరగా అలసట రావడం, అనేక వ్యాధులు చుట్టుముట్టడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం మొదలైన ఇబ్బందులను ఊబకాయస్తులు ఎదుర్కొంటారు. సైన్స్ ప్రకారం…అధిక బరువు అనేది వ్యక్తి యొక్క శారీరక, మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కాగా, ఈరోజుల్లో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు… అందం, డబ్బులు, ఫిట్నెస్ చూసి లవ్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. కొంతకాలం ప్రేమించుకోగానే ఏదో ఒక సిల్లీ కారణాలు చెప్పుకుని చాలా మంది బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా ఒకటి వెలుగుచూసింది.
పువి అనే టిక్‌టాక్ యూజ‌ర్ త‌న వ‌ర్క‌వుట్ వీడియోల‌ను త‌ర‌చూ షేర్ చేస్తుండే వాడు. ఈ క్రమంలోనే తన వెయిట్‌ లాస్‌ జర్నీని అతను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అతని స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో పువి చెప్పిన వివరాల ప్రకారం…రెండేళ్ల క్రితం అధిక బ‌రువుతో బాధపడుతున్న పువిని అదే కార‌ణంతో అతడి ప్రియురాలు విడిచిపెట్టింది. ప్రియురాలు బ్రేకప్‌ చెప్పడంతో పువి చాలా కుంగిపోయాడు. దీంతో పువి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన శరీరాకృతిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఛాలెంజ్‌గా తీసుకుని.. జిమ్‌కు వెళ్లి వర్కౌట్‌ చేయడం ప్రారంభించాడు. క్రమంగా శరీరంలో మార్పు వచ్చింది.
ప్రియురాలు బ్రేకప్‌ చెప్పినప్పుడు 139 కిలోల బరువు ఉన్న పువి… 18 నెలలు కఠిన వ్యాయామం చేసి 70 కిలోల బరవు తగ్గాడు. ప్రస్తుతం పువి బరువు 70 కిలోలు. పువి త‌ర‌చూ షేర్ చేస్తుండే వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండటంతో ఇప్పుడు ఈ స్టోరీ చెక్కర్లు కొడుతుంది. ట్రిపుల్‌ ఎక్స్‌ఎల్‌ సైజ్‌ నుంచి స్మాల్‌ సైజ్‌కు మారిపోయిన ఫువి కృషి, పట్టుదలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news