” ప్రిన్స్” మూవీ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో శివకార్తీకేయన్ నటిస్తున్న చిత్రం ‘ప్రిన్స్’. వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నాడు శివ కార్తికేయన్. టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తిరిగి ఎక్కుతున్న కంప్లీట్ ఎంటర్టైనర్ ” ప్రిన్స్”. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయకగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తెలుగు లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ” ఇంగ్లాండ్ క్వీన్.. నిన్ను ఇలా రమ్మన్నాను” అంటూ ఈ పాట సాగుతుంది. మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తమన్ కంపోజ్ చేసిన పాట ఇది. జోరుగా హుషారుగా సాగే బీట్ కి రామ జోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా.. రామ్ మిర్యాల బృందం ఆలపించింది.