వామ్మో కీరవాణి రెమ్యూనరేషన్ తో రెండు సినిమాలు తీసేయొచ్చు తెలుసా..!

-

బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆర్.ఆర్.ఆర్. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, మరో సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు గా రాం చరణ్, కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్న ఈ సినిమా 2021 సంక్రాంతికి ప్రపంచ స్థాయిలో రిలీజ్ కానుంది.

 

ఇక రాజమౌళి దాదాపు బాహుబలి కి పనిచేసిన టెక్నికల్ టీమ్ తోనే ఆర్.ఆర్.ఆర్ ని తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు తన ప్రతీ సినిమాకి తప్పక తోడుండే సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. అదేమిటంటే కీరవాణి ఆర్.ఆర్.ఆర్. సినిమాకి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి. అవును ఈ సినిమాకి కీరవాణి అందుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే నోరెళ్ళబెట్టి షాకవ్వాల్సిందే. ఈ సినిమాకు కీరవాణి 16 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. ఈ లెక్కన చూస్తే ఏ. ఆర్ రెహమాన్ తర్వాత ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్న సంగీత దర్శకుడిగా కీరవాణి రికార్డు క్రియోట్ చేసినట్టే అని ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఆయన రెమ్యూనరేషన్ గురించే టాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతోంది.

ఇక కీరవాణి పేరు రికార్డుల్లో నిలిచి పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో ఇప్పటివరకూ ఏ సంగీత దర్శకుడు ఇంత రెమ్యూనరేషన్ అందుకుంది లేదు. సౌత్ అండ్ నార్త్ లో ఇప్పటి వరకు ఒక్క ఏ.ఆర్ రెహమాన్ మాత్రమే ఆ స్థాయి లో రెమ్యూనరేషన్ ని అందుకున్నారు. ప్రస్తుతం సౌత్ లో ఏ.ఆర్ రెహమాన్.. ఇళయరాజా మాత్రమే టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా వెలుగుతున్నారు. ఇక బాహుబలి తర్వాత కీరవాణి పేరు కూడా ఈ ఇద్దరి పక్కన చేరింది. ఇక ఈ రెమ్యూనరేషన్ గురించి తెలిసిన చాలా మంది ఈ బడ్జెట్ తో రెండు సినిమాలు తీయోచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news