చంద్రబాబుని కోలుకోలేని దెబ్బ కొడుతున్న ఐటి…!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆర్ధిక మూలాలను ఐటి శాఖ టార్గెట్ చేసిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. గత నెల మొదటి వారం చంద్రబాబు అత్యంత సన్నిహితుల మీద ఐటి శాఖ దాడులకు దిగింది. దీనితో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన కూడా ఆసక్తికరంగా మారింది.

ఎప్పుడు ఎం జరుగుతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే ఇప్పుడు మీడియాకు అందుతున్న సమాజం ప్రకారం చంద్రబాబు ఆర్ధిక మూలాలను ఐటి శాఖ టార్గెట్ చేసింది అంటున్నారు. పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ తోపాటు చైతన్య విద్యాసంస్ధల అధినేత బీఎస్ రావు, నారాయణ సంస్ధల అధినేత నారాయణ ముగ్గురూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే.

లింగమనేని రమేష్ కు చెందిన లింగమనేని ప్రాపర్టీస్ తో పాటు చైతన్య విద్యాసంస్ధలు మీద ఐటి దాడులు చేస్తుంది. విజయవాడ గాయత్రీ నగర్ లోని లింగమనేని ప్రాపర్టీస్ కార్యాలయంతో పాటు రాష్ట్రంలో శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్ధలకు చెందిన పలు క్యాంపస్ లలో ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ కూడా వీరి మీద దాడులు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

అదే విధంగా మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర మీద కూడా ఐటి దాడులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. వీరిలో ఒకరిని ఐటి శాఖ అరెస్ట్ చేయడమే కాకుండా త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది. అటు లోకేష్ సన్నిహితుల మీద కూడా దాడులు చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news