‘మా’ లుకలుకలు.. ఆయనలా.. వీరిలా..!

-

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లో అక్రమాలు జరుగుతున్నాయని ప్రముఖ దినపత్రిక కథనం మా సభ్యుల మధ్య దుమారాన్ని రేపేలా చేసింది. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న శివాజి రాజా, ట్రెజరర్ శ్రీకాంత్ లు మా నిధులను పక్కదోవ పట్టించారని వార్తలు రాశారు. దీనిపై వివరణ ఇచ్చుకునేందుకు శివాజి రాజా, శ్రీకాంత్, పరుచూరి వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ పెట్టారు.

తాము ఎలాంటి నిధుల దుర్వినియోగం చేయలేదని.. కావాలని తమపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారని అన్నారు శివాజి రాజా, శ్రీకాంత్. ప్రెస్ మీట్ లో వారు కార్యదర్శి నరేష్ ను ఉద్దేశించి మాట్లాడారు. అయితే వారు ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం మా కార్యదర్శి నరేష్ మరో ప్రెస్ మీట్ పెట్టారు. తనకు అనుమానాలు మాత్రమే ఉన్నాయని వాటిని సమర్ధించుకోవాల్సిన అవసరం లేదని.

సిల్వర్ జూబిలీ వేడుకలతో పాటుగా, మా బిల్డింగ్ కోసం కూడా ప్రభుత్వ సహకారం తీసుకోవాలని అనుకున్నారు. అయితే చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వెళ్లిన ఫారిన్ సిల్వర్ జూబిలీ సభలలో 2 కోట్లకు బదులు 1 కోటికే బేరం మాట్లాడుకున్నారట. మధ్యలో విజయ్ అనే వ్యక్తి ఈ కార్యక్రమంలో భాగమయ్యాడట. శ్రీకాంత్, శివాజి రాజాలేమో తాము డబ్బు వాడుకోలేదని ఒకవేళ నిరూపిస్తే ఆస్తి మొత్తం మా కు రాసిస్తామని శివాజి రాజా. మరో పక్క శ్రీకాంత్ కూడా తన మీద వచ్చిన ఆరోపణలు నిజమైతే మా సభ్యత్వానికి దూరంగా ఉంటానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news