రీమేక్ అవ్వనున్న సూపర్ స్టార్ సినిమా..!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఇంకా అలాంటి అద్భుతమైన సినిమాల్లో దూకుడు సినిమా ఒకటి. 2011 లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సినిమా పదేళ్ల తర్వాత ఇప్పుడు రీమేక్ అవుతుంది.

శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సమంత హీరోయిన్ గా నటించారు. యాక్షన్ , కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు హిందీ రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్ నేషనల్ సొంతం చేసుకుంది. ఇంకా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ లేదా అజయ్ దేవగన్ నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా బాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలు రీమేక్ అయ్యి రికార్డు సృష్టించాయి.

Read more RELATED
Recommended to you

Latest news