మీ ప్రేమ చూసి ఆనందంతో ఉప్పొంగిపోయా.. మహేశ్ బాబు స్పెషల్ పోస్టు

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆగస్టు 9వ తేదీన పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆయన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్, ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయన తాజాగా తన అభిమానులను ఉద్దేశించి నెట్టింట ఓ పోస్టు పెట్టారు.

తన పుట్టిన రోజు సందర్భంగా పంపిన సందేశాలు, చూపించిన ప్రేమ పట్ల అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యాన్స్ ప్రేమ చూసి తాను ఆనందంతో ఉప్పొంగిపోయానని.. తన ప్రత్యేకమైన రోజును మరింత స్పెషల్గా మార్చినందుకు ఫ్యాన్స్కు థాంక్యూ చెప్పారు. ప్రతి ఏడాది తనపై చూపిస్తున్న ప్రేమకు, సపోర్టుకు తానెప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. మహేశ్‌బాబు పుట్టినరోజును పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక మహేశ్‌ నటించిన ‘మురారి’ మూవీ రీ రిలీజ్ కావడంతో థియేటర్ల వద్ద సందడి కనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news