మహేష్ ను లంచ్ కు పిలిచిన హాలీవుడ్ స్టార్.. సినిమా కోసమే అంటూ ఫ్యాన్స్ సంబరాలు..!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి హాలీవుడ్ స్టార్ బిల్ డ్యూక్ నుండి లంచ్ ఇన్విటేషన్ వచ్చింది. తెలుగు హీరోనే అయినా మహేష్ సినిమాలు నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాయి. అంతేకాదు టాలీవుడ్ బాండ్ గా మహేష్ కు సూపర్ క్రేజ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ తర్వాత టాకీవుడ్ జేమ్స్ బాండ్ గా మహేష్ కు ఫ్యాన్స్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది.

బిల్ డ్యూక్ ఇన్విటేషన్ కేవలం లంచ్ వరకేనా లేక మహేష్ ను కూడా హాలీవుడ్ సినిమాలో నటించమని అడిగేందుకా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇండియన్ సినిమాల మీద.. ఇండియన్ హీరోస్ మీద హాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను పడ్డది. రోబో, బాహుబలి సినిమాలు మన ప్రతిభ కబడేలా చేశాయి. సో బిల్ డ్యూక్స్ మహేష్ ను కేవలం లంచ్ కే పిలిచాడా లేక సినిమా ప్లానింగ్ ఏదైనా ఉందా అన్నది త్వరలో తెలుస్తుంది. బిల్ డ్యూక్ మహేష్ తో పాటుగా దర్శకుడు వంశీ పైడిపల్లి, కోలీవుడ్ డైరక్టర్ మురుగదాస్ లకు ఈ లంచ్ ఇన్విటేషన్ పంపించారట. మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కు ఇది క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news