క్రికెట్, అమ్మాయిలు, పెళ్లి, పిల్లలు ఇవి నాకు అర్ధం కాని టాపిక్స్ : రానా

-

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తినన్నూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ. ఏప్రిల్ 19న రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో వసూళ్ల పరంగా కూడా దూసుకెళ్తుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కు స్పెషల్ గెస్ట్ గా దగ్గుబాటి రానా అటెండ్ అయ్యారు. సక్సెస్ మీట్ కు వచ్చి చాలా రోజులైందంటూ మొదలు పెట్టిన రానా తనకు క్రికెట్, అమ్మాయిలు, పెళ్లి, పిల్లలు ఇవి అర్ధం కాని టాపిక్స్ అన్నాడు.

అయినా సరే జెర్సీ సినిమా చూసి ఏడ్చేశానని.. నాని ప్రతిసారి ఇన్ స్పైర్ చేస్తూనే ఉన్నాడు. సినిమాకి అతనికి ఉన్న ప్రేమ తనకు స్పూర్తి నింపేలా చేస్తుందని అన్నాడు రానా. ఓ సూపర్ హిట్ సినిమాతో కన్నడ యాక్ట్రెస్ శ్రద్ధ శ్రీనాథ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందని. ఆమెకు తను ఫ్యాన్ అని అన్నాడు రానా. మొత్తానికి రానా లాంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ను జెర్సీ ఏడిపించేసిందన్నమాట. జెర్సీ సినిమాలో నాని నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news