ఆన్ లైన్ లో మహర్షి సినిమా.. షాక్ లో మహేష్..!

-

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. మహేష్ 25వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా నుండి వస్తున్న మహేష్ బాబు పోస్టర్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవగా సడెన్ గా మహేష్ మహర్షి నుండి ఓ సీన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. మహర్షిలో కీలక సన్నివేశంగా అనిపిస్తున్న ఆ సీన్ లో మహేష్ బాబు పల్లెటూరు వాతావరణంలో మీడియాతో మాట్లాడుతున్నాడు.

ఆ సీన్ తీసిన విధానం చూస్తే షూటింగ్ టైంలో ఎవరో మొబైల్ తో సీక్రెట్ గా తీసినట్టు తెలుస్తుంది. చిత్రయూనిట్ ఈ వీడియో లీక్ పై చాలా సీరియస్ గా ఉన్నారు. కేవలం ఈ సీన్ మాత్రమేనా ఇంకా వేరే సీన్స్ కూడా లీక్ చేశారా అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే చిత్రయూనిట్ వెంటనే గుర్తించడంతో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఆ వీడియోని డిలీట్ చేశారు.

స్టార్ సినిమాకు ఈ లీకుల కష్టాలు తప్పేలా లేవు. ఇదేదో సరదాగా చేస్తున్నా సినిమా రంగానికి అది ఎంత పెద్ద దెబ్బన్నది వారు గ్రహించాలి. మహర్షి చిత్రయూనిట్ ఇక నుండి మరింత జాగ్రత్తగా ఉండనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news