ఏపీ సమగ్ర సర్వే: వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఎవరో తెలిసిపోయింది..!

-

దేశమంతా ఎన్నికలు ఉన్నాయి. కానీ.. అందరి దృష్టి మాత్రం ఏపీ మీదనే ఉంది. చివరకు దేశ ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఏపీ ఎన్నికల మీదనే దృష్టి పెట్టారు. ఏపీలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో రాజకీయ వేడి బాగా రగులుకుంటోంది. ప్రధాన పార్టీలన్నీ నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. ఓటర్లను హామీలతో మభ్య పెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నాయి.

అయితే.. ఏపీలో గెలిచేదెవరు. ఇదివరకు ద్విముఖ పోటీ ఉండేది కానీ.. ఇప్పుడు త్రిముఖ పోటీ.. మళ్లీ తన అధికారాన్ని చంద్రబాబు నిలబెట్టుకుంటారా? లేక వైఎస్ జగన్ కు ప్రజలు ఈసారి అవకాశం ఇస్తారా? సినీ గ్లామర్ తో వచ్చిన పవన్ ను సీఎం చేస్తారా? అసలు.. ఎవరు గెలుస్తారు.. అని అంతా ఊపిరి బిగపట్టుకొని చూస్తున్నారు.

అయితే.. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు సీఎం అవుతారు.. అనే దానిపై రెడ్ ప్రికి న్యూస్ అనే సంస్థ ఓ సమగ్ర సర్వేను నిర్వహించింది.

ప్రతి జిల్లాలోనూ శాంపిల్స్ తీసుకొని సర్వే నిర్వహించారు. ప్రతి జిల్లాలోనూ నియోజవర్గాల ప్రకారం ప్రజలు ఏ పార్టీకి ఓటేశారంటే…

శ్రీకాకుళం: వైసీపీకి 6 సీట్లు, టీడీపీకి 3 సీట్లు, జనసేనకు 1… అది కూడా పాలకొండలో.
విజయనగరం: వైసీపీకి 8 సీట్లు, టీడీపీకి 2
విశాఖపట్టణం: వైసీపీకి 7, టీడీపీకి 4, జనసేనకు 3.. పవన్ కల్యాణ్ గాజువాకలో గెలుస్తారట.
తూర్పు గోదావరి: వైసీపీకి 12, టీడీపీకి 3, జనసేనకు 4



పశ్చిమ గోదావరి: వైసీపీకి 9, టీడీపీకి 4, జనసేనకు 2. పవన్ కల్యాణ్ భీమవరంలో గెలుస్తారట.
కృష్ణా: వైసీపీకి 9, టీడీపీకి 7, జనసేనకు ఒక్క సీటు కూడా రాదట.
గుంటూరు: వైసీపీకి 10, టీడీపీకి 7, మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేశ్ కు ఓటమి తప్పదట.
ప్రకాశం: జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందట. మొత్తం 12 నియోజకవర్గాల్లో వైసీపీనే గెలుస్తుందట.
నెల్లూరు: జిల్లాలో వైసీపీకి 8, టీడీపీకి 2
కర్నూలు: జిల్లాలో వైసీపీకి 12, టీడీపీకి 2
కడప: జిల్లాలో వైసీపీకి 10, టీడీపీ ఖాతా తెరవదు.
అనంతపురం: జిల్లాలో వైసీపీకి 10, టీడీపీకి 4
చిత్తూరు: జిల్లాలో వైసీపీకి 11, టీడీపీకి 3 సీట్లు వస్తాయట.

పైమొత్తం చూస్తే, వైసీపీకి 124, టిడిపీకి 41, జనసేనకు ఆశ్యర్యకరంగా 10 సీట్లు రానున్నాయి. దీని ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎంతో సులభంగా అధికారంలోకి వస్తుందని ఈ సర్వే చెబుతుంది. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెట్టినా జగన్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వే తేల్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version