బిగ్ బాస్ 3 హోస్ట్ వెంకటేష్.. శ్రీ రెడ్డి చెప్పిందంటే..!

-

రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ మూడవ సీజన్ కు సన్నద్ధం అవుతుంది. స్టార్ మా ప్రెస్టిజియస్ గా రూపొందించే బిగ్ బాస్ రియాలిటీ షో 3వ సీజన్ హోస్ట్ గా ఎవరన్నది ఇంకా కన్ ఫ్యూజన్ గానే ఉంది. మొదటి సీజన్ చేసిన ఎన్.టి.ఆర్ 3వ సీజన్ కూడా చేస్తాడని అనుకున్నారు కాని ఆర్.ఆర్.ఆర్ సినిమా వల్ల అది కుదిరేలా లేదు. బిగ్ బాస్ 3 హోస్టుల లిస్ట్ లో నాగార్జున, వెంకటేష్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఉన్నారు.

అయితే ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ విక్టరీ వెంకటేష్ బిగ్ బాస్ 3కి హోస్ట్ గా కన్ఫాం అని ఎనౌన్స్ చేసింది సంచలనాల శ్రీ రెడ్డి. వెంకీ మామ ఫ్యాన్స్ కు ఓ శుభవార్త బిగ్ బాస్ 3కి హోస్టింగ్ వెంకటేష్ చేస్తున్నాడని ఫేస్ బుక్ లో పెట్టింది. అయితే శ్రీ రెడ్డికి ఎలా తెలుసన్నది పక్కన పెడితే శ్రీ రెడ్డి మాత్రం ఈ విషయం చెబుతూ వెంకీ మామా అని మరోసారి దగ్గుబాటి ఫ్యామిలీతో వరుస కలిపింది. దాదాపు వెంకటేష్ బిగ్ బాస్ హోస్ట్ అని ఫిక్స్ అయినట్టే.. అఫిషియల్ ఎనౌన్స్ రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version