నరేష్ కు వార్నింగ్ ఇచ్చిన మహేష్

-

సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను తర్వాత వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహర్షి. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడట. ఈ సినిమాలో నరేష్ రోల్ ఎలా ఉండబోతుందన్న ఎక్సైటింగ్ అందరిలో ఉంది. శ్రీకృష్ణుడు కుచేళుడుగా మహేష్, నరేష్ కనిపిస్తారని అంటున్నారు. సెప్టెంబర్ 7న అల్లరి నరేష్ నటించిన సిల్లీ ఫెల్లోస్ రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహర్షి సినిమా విశేషాలను పంచుకున్నాడు అల్లరి నరేష్. ఆ సినిమాలో నరేష్ మరోసారి గాలి శ్రీను లాంటి రోల్ లో కనిపిస్తాడట. అంతేకాదు సినిమాలో మహేష్ తనకు మంచి సీన్స్ ఉన్నాయని.. సెట్స్ లో మహేష్ చాలా జోవియల్ గా ఉంటారని.. మహేష్ సెన్సార్ హ్యూమర్ కూడా భలే ఉంటుందని అన్నాడు.

సినిమా గురించి ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలను అడుగగా మహర్షి గురించి ఏమాత్రం రివీల్ చేయొద్దని మహేష్ వార్నింగ్ ఇచ్చారని సరదాగా అన్నాడు నరేష్. మొత్తానికి మహేష్ సినిమాలో నరేష్ రోల్ పై వస్తున్న వార్తలన్ని చూస్తుంటే ఆ సినిమా నరేష్ కెరియర్ కు చాలా హెల్ప్ అయ్యేలా ఉందని మాత్రం చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news