బిగ్‌బాస్‌లో ఆమెను గెలిపించే కుట్రా…. మ‌హేష్ విట్టా డౌట్‌..!

యూ ట్యూబ్ నుంచి సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎదిగిన మ‌హేష్ విట్టా ఆ త‌ర్వాత బిగ్‌బాస్ 3లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్‌లో ముందు ఎలాంటి అంచ‌నాలు లేక‌పోయినా చాలా దూరం జ‌ర్నీ చేశాడు. 12 వారాల వ‌ర‌కు హౌస్‌లో ఉన్న మ‌హేష్ విట్టా బ‌య‌ట కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్ప‌రుచుకున్నాడు. మ‌ధ్య‌లో సైతం బ‌ల‌మైన పోటీదారుల మ‌ధ్య‌లో నామినేష‌న్‌కు వెళ్లినా సేఫ్ అయ్యాడు.

ఇక ఇప్పుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మ‌హేష్ ఇంట‌ర్వ్యూల్లో షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. బిగ్‌బాస్ చాలా క్లారిటీగా శ్రీముఖి వైపు మొగ్గు చూపుతున్నాడ‌ని… ఆమె గెలిచినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. ఇక ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన హిమ‌జ సైతం బిగ్‌బాస్ డైరెక్ట‌ర్ల‌లో త‌న‌కు తెలిసిన వాళ్లు ఉన్నార‌ని చెప్పింద‌ని.. ఆమె డైరెక్ష‌న్‌లో టాస్క్‌లు మార్చేస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఇప్పుడు మ‌హేష్ సైతం అదే ఆరోప‌ణ చేయ‌డంతో బిగ్‌బాస్‌లో శ్రీముఖిని గెలిపించే కుట్ర జ‌రుగుతోందంటూ… ఇదంతా పెద్ర కుట్ర గేమ్ అంటూ సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి బిగ్‌బాస్ శ్రీముఖికి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తూ…. మిగిలిన వారిని చూపించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కంటెస్టెంట్లు కూడా బిగ్‌బాస్ శ్రీముఖిని గెలిపించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్య‌లు షో ప‌ట్ల చాలా సందేహాలు రేకెత్తిస్తున్నాయి.