వాణీ జయరామ్ మృతిపై పనిమనిషి షాకింగ్ కామెంట్స్..!

-

ప్రముఖ నేపథ్య గాయని.. అలనాటి మేటి సింగర్ వాణీ జయరాం అనుమానాధాస్పద స్థితిలో నిన్న చెన్నైలోని తన నివాసంలో మరణించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈమె మరణం పై అనుమానాలు తలెత్తుతున్నాయి. అపార్ట్మెంట్లో ఆమె విగత జీవిగా పడి ఉన్న తీరు ఆమె ముఖంపై కనిపిస్తున్న గాయాలు అందరి మనసులలో కలకలం సృష్టిస్తున్నాయి. అసలేం జరిగింది అనే విషయానికి వస్తే.. రోజులాగే ఆమె ఇంట్లో పనిచేసే పనిమనిషి శనివారం కూడా వాణి జయరామ్ ఉంటున్న అపార్ట్మెంట్ కు వెళ్ళింది. ఇంట్లోకి వెళ్లేందుకు కాలింగ్ బెల్ ప్రెస్ చేయగా ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టిన తలుపు తీయలేదు. దీంతో కంగారుపడిన పనిమనిషి వాణి జయరాం బంధువులకు సమాచారం అందివ్వగా.. ఆ బంధువులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు డోర్ ని బద్దలు కొట్టి చూడగా ఆమె ముఖంపై తీవ్ర గాయాలతో నట్టింట్లో విగతా జీవిగా పడి ఉన్నారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. ఆమెను ఎవరు కొట్టి చంపి ఉంటారు అనే కోణంలో పరిశీలిస్తున్నారు. వాణి జయరాం భర్త జయరామ్ 2018లో చనిపోవడం.. వారికి పిల్లలు కూడా లేకపోవడంతో ఆమె ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. రోజు వచ్చే పనిమనిషి ఆమెకు సహాయం గా ఉండేది . పని పూర్తయ్యాక వెళ్ళేది. ఇవాళ కూడా రోజు వెళ్లినట్టే వాణిజరం ఇంటికి వెళ్లి చూడగా ఈ ఘటన వెలుగు చూసింది.

ఇకపోతే సింగర్ గా వివిధ భాషల్లో 20వేలకు పైగా పాటలు పాడిన ఈమె ఇటీవలే పద్మభూషణ్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఏది ఏమైనా ఇలా ఒకరి చేతిలో ఆమె మరణించడం ఇండస్ట్రీకి మరింత బాధాకరమని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news