ఎడిట్ నోట్: కేటీఆర్ ‘సీఎం’ రోల్!

-

తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓ వైపు అధికార బీఆర్ఎస్ పార్టీ మధ్య, బీజేపీ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర స్థాయిలోనే కాదు..దేశ స్థాయిలో కూడా వార్ నడుస్తోంది. కేంద్రంలోని బి‌జే‌పికి చెక్ పెట్టాలని చెప్పి కే‌సి‌ఆర్ దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి యాక్టివ్ గా తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు కీలక రాష్ట్రాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీని విస్తరించే కార్యక్రమంలో పడ్డారు.

ఇదే సమయంలో తెలంగాణలో కేటీఆర్..కీలక పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కే‌సి‌ఆర్ దేశ రాజకీయాల వైపు చూడటంతో కేటీఆర్…తెలంగాణపై ఫోకస్ పెట్టారు. అధికారికంగా తెలంగాణ బి‌ఆర్‌ఎస్ శాఖ అధ్యక్షుడుని ప్రకటించలేదు గాని..పరిస్తితులు చూస్తుంటే కేటీఆర్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కే‌సి‌ఆర్ గాని దేశ రాజకీయాల వైపు వెళితే..తెలంగాణకు కే‌టి‌ఆర్ సీఎం అవుతారనే ప్రచారం ఉంది. ఇలా ప్రచారం జరుగుతుండగానే తాజాగా అసెంబ్లీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

 

గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో కే‌సి‌ఆర్ లేరు..దీంతో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు కే‌టి‌ఆర్ కౌంటర్లు ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క, ఎం‌ఐ‌ఎం నుంచి అక్బరుద్దీన్, బి‌జే‌పి నుంచి ఈటల రాజేందర్..ఇలా ఎవరు మాట్లాడిన వారికి సమాధానాలు ఇచ్చారు. ఒకో సందర్భంలో చాలా సాఫ్ట్ గా సమాధానాలు చెప్పగా, ఒకో సందర్భంలో కౌంటర్లు ఇచ్చారు. ఆఖరికి హౌస్‌ని ఆర్డర్ లో పెట్టే బాధ్యతని కూడా కే‌టి‌ఆర్ తీసుకున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నా సరే..ఆ బాధ్యతని కే‌టి‌ఆర్ నిర్వర్తించారు.

టోటల్ గా అసెంబ్లీలో కే‌టి‌ఆర్ వన్ మ్యాన్ షో నడిచింది. ఇక ఈ పరిస్తితులని బట్టి చూస్తే తెలంగాణ బాధ్యతలు కే‌టి‌ఆర్‌కు ఇవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ మళ్ళీ గెలిస్తే కే‌టి‌ఆర్ సీఎం అవుతారని ప్రచారం మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో కే‌సి‌ఆర్ ఎంపీగా పోటీ చేసి దేశ రాజకీయాల వైపుకు వెళ్తారని, అప్పుడు కే‌టి‌ఆర్‌ని సి‌ఎం చేస్తారని అంటున్నారు. చూడాలి మరి కే‌టి‌ఆర్  సి‌ఎం అవుతారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news