మజిలీ ఫస్ట్ సాంగ్.. వేర్ ఈజ్ ద లవింగ్.. వేర్ ఈజ్ ద ఫీలింగ్..!

-

అక్కినేని నాగ చైతన్య సమంత లీడ్ రోల్స్ లో శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా మజిలీ. షైన్ పిక్చర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజ్ చేశారు. వన్ బోయ్ వన్ గాళ్ లుకింగు.. హైటు వెయిటు చెకింగ్.. అంటూ వచ్చే ఈ సాంగ్ వేర్ ఈజ్ ద లవింగ్.. వేర్ ఈజ్ ద ఫీలింగ్ అంటూ వచ్చింది.

సినిమాలో మరో హీరోయిన్ గా దివ్యాన్ష కౌశిక్ నటిస్తుంది. చైతు ప్రేయసిగా దివ్యాన్ష నటిస్తుండగా భార్యగా సమంత నటిస్తుంది. రియల్ లైఫ్ భార్యా భర్తలు రీల్ లైఫ్ లో కూడా వారి నిజ జీవిత పాత్రలను పోశిస్తున్నారు. సినిమాలోని ఈ ఫస్ట్ సాంగ్ అదరగొట్టగా.. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news