ప్రేమకథా చిత్రం 2 ట్రైలర్.. ఇది రొటీన్ దెయ్యమే

-

2013లో సుధీర్ బాబు హీరోగా మారుతి నిర్మాణంలో వచ్చిన సినిమా ప్రేమ కథా చిత్రం. ఆ సినిమాకి మారుతి నిర్మాతే అయినా దర్శకుడిగా కూడా పనిచేశాడని అన్నారు. ఇదిలాఉంటే 6 ఏళ్ల తర్వాత ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వల్ రాబోతుంది. సుమంత్, నందిత రాజ్, సిద్ధి ఇద్నాని కలిసి నటించిన ప్రేమకథా చిత్రం 2 ట్రైలర్ రిలీజైంది.

హర్రర్ కథలు చూపించే రొటీన్ స్టైల్ లో ఈ ట్రైలర్ ఉంది. అదే పాడుపడ్డ బంగ్లా అందులోని హీరో అండ్ గ్యాంగ్ వెళ్లడం వారితో దెయ్యం ఆడుకోవడం ఆ తర్వాత దాన్ని వదిలించుకునేందుకు హీరో హీరోయిన్ ఏం చేశారు అన్నది సినిమా కథ. పరమ రొటీన్ పాయింట్ తో వచ్చిన ఈ ట్రైలర్ కూడా అంతే రొటీన్ గా అనిపిస్తుంది. అయితే ట్రైలర్ ఇలా ఉన్నా సినిమాలో ఏదైనా కంటెంట్ ఉండొచ్చు. మార్చి 21న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను హరికృష్ణ డైరెక్ట్ చేశారు. ఆర్.టి.ఏ క్రియేషన్స్ లో సుదర్శన్ రెడ్డి ఈ సినిమా నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news