తనకు చంద్రబాబు వైజాగ్ ఎంపీ టిక్కెట్టు ఇచ్చేలా చేస్తే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.40 లక్షలను ఇస్తానని భరత్ చెబుతున్నారట. కేవలం తన పేరును చంద్రబాబు ఎదుట ప్రతిపాదిస్తే చాలు అంత మొత్తం ఇస్తానని భరత్ ఆఫర్ చేస్తున్నాడట.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు మరోవైపు దేశంలో లోక్‌సభ ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయి. ఈ క్రమంలోఎన్నికల సంఘం కూడా నేడో, రేపో ఎన్నికల నగారా మోగించనుంది. దీంతో అనేక రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. టిక్కెట్టు పొందడం కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. అదే కోవలో బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ కూడా టీడీపీలో వైజాగ్ ఎంపీ టిక్కెట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అందుకోసం తన పేరు ప్రతిపాదించే నేతలకు అతను భారీగానే ముట్టజెబుతున్నాడని సమాచారం.
విశాఖ నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసేందుకు బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ ఉత్సాహంగా ఉన్నారట. అందుకు గాను అతను భారీ ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లుగా కూడా తెలిసింది. అయితే భరత్‌కు టిక్కెట్‌ను ఇచ్చే విషయంపై మాత్రం చంద్రబాబు ఆసక్తి చూపించడం లేదట. కాగా వైజాగ్ టీడీపీ టిక్కెట్టు భరత్‌కే దక్కుతుందని ప్రచారం మాత్రం జోరుగానే సాగుతోంది. కానీ అందుకు చంద్రబాబు ఏమాత్రం అనుకూలంగా లేరని తెలిసింది.
అయితే ఎట్టి పరిస్థితిలోనూ టీడీపీ తరఫున వైజాగ్ నుంచి పోటీ చేసేందుకే భరత్ యత్నిస్తున్నాడని తెలిసింది. అందులో భాగంగానే విశాఖ ఎంపీ సీటు పరిధిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్‌చార్జిలు తన పేరును చంద్రబాబు ఎదుట ప్రతిపాదిస్తే అందుకు బాబు ఒప్పుకుంటారని భరత్ అనుకుంటున్నారట. దీని కోసం భరత్ సదరు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు భారీ మొత్తం ముట్టజెబుతున్నట్లు తెలిసింది. తనకు చంద్రబాబు వైజాగ్ ఎంపీ టిక్కెట్టు ఇచ్చేలా చేస్తే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.40 లక్షలను ఇస్తానని భరత్ చెబుతున్నారట. కేవలం తన పేరును చంద్రబాబు ఎదుట ప్రతిపాదిస్తే చాలు అంత మొత్తం ఇస్తానని భరత్ ఆఫర్ చేస్తున్నాడట. అంతేకాదు, ఇప్పటికే పలువురు నేతలకు ఆ మొత్తం డబ్బు ముట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వైజాగ్ ఎంపీ టిక్కెట్ భరత్‌కు ఇవ్వాలనే వార్తలు జోరందుకున్నాయి. మరి చంద్రబాబు బాలయ్య చిన్నల్లుడికి టిక్కెట్ ఇస్తారో, ఇవ్వరో.. వేచి చూస్తే తెలుస్తుంది..!