మలైక అరోరా యస్​ చెప్పింది అర్జున్​కు కాదంట.. మరి ఎవరికో తెలుసా?

-

బాలీవుడ్ ఐటమ్ గర్ల్ మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో 4 సంవత్సరాలుగా ప్రేమాయణం నడుపుతుంది. కాగా ఇప్పుడు ఈ ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అంతా అనుకుంటున్నారు. సినీ నిర్మాత బోనీ కపూర్ తనయుడు అయిన అర్జున్.. వయసులో మలైకా కంటే 12 ఏళ్ళ చిన్నోడు. గత కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ బి-టౌన్ లో జరిగే ప్రతి ఫంక్షన్ లో జంటగా దర్శనమిచ్చేవారు.

- Advertisement -

అయితే తాజాగా మలైకా అరోరా నేను ఓకే చెప్పా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో లవ్‌ ఎమోజీలు జతచేశారు. దేనికి? ఎవరికి? అనే వివరాలేవీ ఆమె పంచుకోలేదు.

పెళ్లికి సిద్ధమయ్యానని ఆమె తమకేదే హింట్‌ ఇచ్చినట్టు భావించిన ఎంతోమంది నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.మలైక, అర్జున్‌కపూర్‌లు కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేశారు. కొంతకాలంగా హీరో అర్జున్‌ కపూర్‌తో మలైక ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

అర్జున్‌తో పెళ్లికి మలైక అంగీకరించిందంటూ ఆమె పెట్టిన పోస్ట్‌ను ఆధారంగా చేసుకుని పలు వెబ్‌సెట్లు వార్తలు రాశాయి. సినీ ప్రముఖులూ మలైకకు కంగ్రాట్స్‌ చెప్పడం గమనార్హం. అలా ఆ న్యూస్‌, అభిమానుల పోస్ట్‌లతో #malaika అనే హ్యాష్‌ట్యాగ్‌ కొంతసేపు ట్విటర్‌ ట్రెండింగ్‌ జాబితాలో నిలిచింది.

ఇది ఇంకెక్కడికి దారి తీస్తుందో అని అనుకున్న మలైక అసలు విషయాన్ని బయట పెట్టారు. నేను ఎస్‌ అని చెప్పింది ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ సంస్థకు. ఆ ఓటీటీ నిర్మిస్తున్న రియాలిటీ షోకు నేను హోస్ట్‌గా వ్యవహరిస్తున్నా. మూవింగ్‌ విత్‌ మలైక అనే ఆ కార్యక్రమం డిసెంబరు 5 నుంచి ప్రసారమవుతుంది అని మలైక వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...