ఏంటీ.. తిరుపతి వెంకన్న మంచు లక్ష్మికి పెదనాన్న అవుతారా..?

272

తెలుగు ప్రేక్షకులకు పరిచయమే అవసరం లేని నటి మంచు లక్ష్మీ. మంచు లక్ష్మీ నటిగానే కాదు.. యాంకర్‌, నిర్మాతగానూ రాణిస్తున్నారు. తొలి రోజుల్లో ఆమె కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు కుమార్తెగా పరిచయమైనప్పటికీ అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. యాంకర్‌గా ఆమె మాట్లాడే మాటలు ఎంతగానో ఫేమస్. అడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్న మంచు లక్ష్మీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోనూ సందడి చేస్తుతంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఓ చానెల్ పెట్టి అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. నేటి సమాజంలో పిల్లలు, తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నారు? పిల్లలను ఎలా చూసుకోవాలి, పిల్లలతో ఎలా సమయాన్ని గడపాలి వంటివాటిపై తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తోంది.

ఇదిలా ఉంటే.. ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతోన్నాయి. గుడికి ఎప్పుడైనా వెళ్తుంటారా అని అడగ్గానే… చాలా తక్కువ కానీ, తిరుమలకు మాత్రం వెళ్తుంటా. చిన్నప్పటి నుండి తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లటం ఇష్టం. అక్కడికి వెళ్తే.. మా పెదనాన్న దగ్గరికి వెళ్లినట్లుంటుంది అని కామెంట్ చేసింది. దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సెటైరికల్‌గా కూడా కామెంట్ చేస్తున్నారు.