ఆర్టీసీ కార్మికుల నుంచి జగన్ కి బిగ్ బ్యాడ్ న్యూస్ ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. విషయంలోకి వెళితే ఆర్టీసీ బస్సులు ప్రయాణించే రూట్లలో ప్రైవేటు బస్సులకు అనుమతి ఇచ్చే వ్యవహారం రోజు రోజుకీ ముదురుతోంది. ప్రైవేట్ సంస్థ బస్సులకు అనుమతి ఇచ్చే విషయం లో ఎవరిని సంప్రదించాల్సిన అనుమతి అవసరం లేదంటూ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మాదిరెడ్డి ప్రతాప్ స్పష్టం చేయటంతో ఆర్టీసీ కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత 24 గంటల్లో వ్యక్తమైంది.Image result for jagan dull

ఈ ప్రకటనతో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు జగన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆరోపించారు. ఇటువంటి ఏకపక్ష అనుమతులు వల్ల ఆర్టీసీ రూట్లలో ప్రైవేటు బస్సులను అనుమతించడం అంటే సంస్థను నిర్వీర్యం చేయడమే అంటూ ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

 

కార్మిక సంఘాలతో చర్చించకుండా ఏ విధంగా ప్రైవేటు సంస్థ బస్సులు ఆర్టీసీ రూట్లలో వస్తాయో మేము చూస్తామంటూ కార్మిక సంఘాలు జగన్ సర్కార్ పై మండిపడుతున్నారు. అయితే విషయం రోజురోజుకి పెద్ద అవుతున్న తరుణంలో ఆర్టీసీ కార్మికుల సంఘాల నుంచి సమ్మె మొదలయ్యే అవకాశం ఉందని ఇది కచ్చితంగా జగన్ సర్కార్ కి బ్యాడ్ న్యూస్ అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Latest news