పవన్ పై మంచు మనోజ్ కామెంట్..!

-

సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రజాసేవ కోసం రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ తను స్థాపించిన జనసేన పార్టీ వివి విధానాలతో కొందరిని ఇంప్రెస్ చేస్తున్నాడు. రాజకీయాల్లో మార్పుని తీసుకురావాలని ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ విధంగా ముందడుగులు వేస్తున్నారు. అందుకే తన పార్టీలోకి విద్యావేత్తలను, ఐఏఎస్ అధికారులు చేరుతున్నారు. ఈ విషయంపై తన స్పందన తెలియచేశారు మంచు మనోజ్.

పవన్ సర్ ను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది.. తమ పార్టీలో విద్యావేత్తలకు స్థానం కల్పించడం ద్వారా జనసేన మరింత గౌరవాన్ని, నమ్మకాన్ని పొందిందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం మంచు మనోజ్ ట్వీట్ పై చర్చ నడుస్తుంది. జనసేనలో మంచు మనోజ్ జాయిన్ అవుతున్నాడన్న విధంగా కామెంట్స్ రావడం విశేషం.

రాబోయే ఏపి ఎన్నికల్లో జనసేన గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. పవన్ అతని పార్టీ ప్రజలకు మేలు కలిగించేలా ఉంటాయని ప్రజలు విశ్వసిస్తే తప్పకుండా రాజకీయాల్లో పెను మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news