పాన్ ఇండియా సినిమాకోసం సాహసం చేస్తున్న మంచు మనోజ్ ..!

నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్. పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ తన ఫ్యూఛర్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు. ప్రస్తుతం మనోజ్ ” అహం బ్రహ్మస్మి” అనే టైటిల్ తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది.

 

ఈ సినిమా తో మనోజ్ భారీ హిట్ దక్కించుకోవాలని ఎంతగానో శ్రమిస్తున్నాడు. గత కొంతకాలంగా వరుసగా ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మంచు మనోజ్, ఒకేసారి పాన్ ఇండియా రేంజ్ సినిమా ని అనౌన్స్ చేసి భారీ షాకిచ్చాడు. అయితే ఈ సినిమా అందరి అంచనాలని అందుకోవడం ఖాయమని అంటున్నారు. ఇక మనోజ్ కూడా ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. అయితే ఈ సినిమా మనోజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతుండటం విశేషం. ఇక ఈ సినిమాలో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ ఉండగా దాని కోసం ఏకంగా ఆరుకోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తాజా సమాచారం.

ప్రముఖ యాక్షన్ కొరియో గ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేపథ్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నారట. ఈ సినిమాలో ఈ ఫైట్ సీక్వెన్స్ హైలైట్ గా నిలవనుందట. 8 నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం యాభైరోజుల పాటు షూటింగ్ జరపనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకూ తన సినిమాల్లో కనిపించని, కొత్త మనోజ్ ని చూస్తారని ఎంతో ధీమాగా చెబుతున్నాడు. మొత్తానికి మంచు హీరో సాహసం చూస్తుంటే ఈ సారి భారీ సక్సస్ ని అందుకోబోతున్నాడని అర్థమవుతుంది.