యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కి బర్త్ డే విషెస్ తెలిపిన సినీ ప్రముఖులు ..!

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్.ట్.ఆర్ ఈ రోజు తన బేర్త్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే నిన్నటి నుంచే తారక్ కి టాలీవుడ్ ప్రముఖులు రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తారక్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రాం, ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్, థమన్, త్రివిక్రం, దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు ..ఇలా ఇండస్ట్రీలో ప్రములందరు బర్త్ డే షెస్ ని తెలుతున్నారు.

 

అయితే వాస్తవంగా ఎన్.టి.ఆర్ నుంచి ఈ రోజు రెండు భారీ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్ వస్తాయనుకుంటే అది కొంత ఫ్యాన్స్ ని ప్రేక్షకులను నిరాశ పరచింది. తారక్ నుంచి ఫ్యాన్స్ ఆశించిన కొమరం భీం పాత్ర ఎలా ఉండబోతుందో రాజమౌళి ఈ సందర్భంగా ఇస్తారని ఆశ పడ్డారు. కాని లాక్ డౌన్ కారణంగా అది సాద్యపడలేదు. అయినా ఫ్యాన్స్ తారక్ కి సినీ ప్రముకులు అందిస్తున్న స్పెషల్ గిఫ్ట్స్, విషెస్ తో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. తారక్ కి అత్యంత సన్నిహితుడు దర్శక ధీరుడు తనదైన శైలిలో నీకన్నా ఉత్తమైన భీమ్ నాకు దొరకడు’ అంటూ శుభాకాంక్షలు తెలిపి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

 

 

 

ఇక టాలీవుడ్ హీరో నారా రోహిత్ తనే స్వయంగా గీసిన ఎన్.టి.ఆర్ బొమ్మ ని స్పెషల్ గిఫ్ట్ గా ఇచ్చాడు. తారక్ ఫిజికల్ ట్రైనర్ కూడా తారక్ సిక్స్ ప్యాక్ లో ఉన్న పిక్ ని రివీల్ చేసి సర్‌ప్రైజ్ చేశాడు. వీరితో పాటు ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ అండ్ కే.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్విట్టర్ లో బర్త్ డే విషెస్ ని తెలిపారు. అలాగే స్టార్ హీరోయిన్ కూడా తారక్ కి బర్త్ డే విషెస్ తో ముంచెత్తారు. వీటితోనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ తారక రాముడు నటనలో, హావా భావాలలో ఆ తారక రాముడికి ఏమాత్రం తీసిపోకుండా చరిత్ర సృష్టిస్తూ అంచలంచెలుగా ఎదిగిన వైనం ఆశ్చర్యకరం.