నాన్నకు ప్రేమతో.. మంచు హీరోల మంచి మనసు..!

మంచు ఫ్యామిలీ హీరోస్ ఎప్పుడూ మంచి పనులకు ముందుంటారని తెలిసిందే. మార్చి 19 మంగళవారం కలక్షన్ కింగ్ మోహన్ బాబు 69వ పుట్టినరోజు జరుపుకున్నారు. తండ్రి మీద ప్రేమతో మంచు హీరోలు విష్ణు, మనోజ్ తమ ఉదారత చాటుకున్నారు. తండ్రి పుట్టినరోజు కానుకగా మంచు మనోజ్ సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్వితను దత్తత తీసుకున్నాడు. ఆమె చదువుకి కావాల్సిన బాధ్యత అంతా తను తీసుకుంటున్నా అంటూ మనోజ్ తెలిపారు.

ఇక మరోపక్క మంచు విష్ణు కూడా తండ్రి పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలోని రుయా హాస్పిటల్ కు కోటి విరాళం ప్రకటించారు. వీటితో పాటుగా ఎమర్జెన్సీ, ఓపీడీ బ్లాకులను నిర్మాణానికి సహకరిస్తానని అన్నారు. మూడేళ్ల కాలంలో కోటి రూపాయాలు హాస్పిటల్ కు ఖర్చు పెడతామని తన ట్విట్టర్ లో మెసేజ్ పెట్టాడు మంచు విష్ణు.