బాహుబలి పాటకి మహేష్ కూతురు స్టెప్పులు..!

సూపర్ స్టార్ మహేష్ కంప్లీట్ ఫ్యామిలీ మెన్. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఖాళీ టైం దొరికితే చాలు వెంటనే ఫ్యామిలీని తీసుకుని ఫారిన్ చెక్కేస్తాడు. మహేష్ నమ్రతలకు ప్రేమకు ప్రతీరూపంగా గౌతం, సితార ఇద్దరు పిల్లలు ఉన్నారు. గౌతం కాస్త మొహమాటంగా ఉంటాడు కాని సితార మాత్రం చిచ్చరపిడుగే. సీతా పాప చేసే అల్లరి గురించి మహేష్ ఎప్పుడు చెబుతూనే ఉంటాడు.

ఇక లేటెస్ట్ గా సితార బాహుబలి పాటకు స్టెప్పులేస్తున్న వీడియోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు మహేష్. వాటే టాలెంట్ సీతాపాప అంటూ తన గారాలపట్టి డ్యాన్స్ చూసి మురిసిపోతున్నాడు మహేష్. సితార ప్రముఖ క్లాసికల్ డ్యాన్స్ ట్రైనర్ అరుణ భిక్షు దగ్గర క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది. బాహుబలి-2 లోని కన్నా నిదురించరా సాంగ్ కు సితార భలే స్టెప్పులేసింది.