తెలంగాణలో కాంగ్రెస్ కు షాక్.. బీజేపీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణ

-

అరుణ కాంగ్రెస్ వీడటానికి గత కొంత కాలంగా కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలే అని తెలుస్తోంది. ఆమె గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారట.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారు. మంగళవారం రాత్రి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు.

congress leader dk aruna joins in bjp

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆమెతో చర్చించి బీజేపీలో చేర్పించినట్లు తెలుస్తోంది. తర్వాత ఆమె బీజేపీ అమిత్ షాతోనూ ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆమె రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన హామీ రావడంతో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడినట్లు తెలుస్తోంది.

బీజేపీ నాయకులు అరుణను మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించనున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఆమె ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఈసందర్భంగా అమిత్ షా ఆమెకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

తమ వర్గానికి అన్యాయం జరిగిందనేనా?

అయితే.. అరుణ కాంగ్రెస్ వీడటానికి గత కొంత కాలంగా కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలే అని తెలుస్తోంది. ఆమె గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారట. తెలంగాణలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ టికెట్ల అంశంలో తమ వర్గానికి అన్యాయం జరిగిందని తన సన్నిహితుల వద్ద ఆమె వాపోయారట. తాజాగా లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల విషయంలోనూ తన అభిప్రాయాలను హైకమాండ్ పట్టించుకోలేదని ఆమె తెలిపారట.

మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కాంగ్రెస్ అరుణను కోరినా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినందున.. ఇప్పుడు పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని అరుణ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. ఎన్నికల ఖర్చుకు సంబంధించి తనకు స్పష్టమైన హామీ ఇస్తేనే పోటీకి దిగుతానని అరుణ కాంగ్రెస్ హైకమాండ్ కు చెప్పినట్లు సమాచారం. అయితే.. పార్టీ మాత్రం ఎన్నికల ఖర్చు గురించి అరుణకు స్పష్టమైన హామీ ఏదీ ఇవ్వలేదట. అంతే కాదు.. మహబూబ్ నగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రతాప రెడ్డి లేదా అనిరుధ్ రెడ్డి, సంజీవ్ ముదిరాజ్ లలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని… అరుణ అదిష్ఠానాన్ని కోరారట. అయినప్పటికీ.. ఆమె సూచనను పరిగణనలోకి తీసుకోకుండా… వంశీచంద్ రెడ్డికి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఇవ్వడంతో అసంతృప్తికి లోనై బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news