మా అసోసియేషన్ కోసం మాట నిలబెట్టుకున్న మంచు విష్ణు..!

-

గత ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఇందులో గెలవడానికి సార్వత్రిక రాజకీయాలను తలపించే విధంగా రెండు వర్గాల వారు చాలా రకాల హామీలు ఇచ్చారు. కానీ చివరికి మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గెలిచారు. అనేక హామీలు ఇచ్చినప్పటికీ అందులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సొంత బిల్డింగ్ పైన మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నారు.. గెలిచి ఇన్ని నెలలవుతున్నా అసలు దాని వూసే లేదు అని పలువురు విమర్శించారు కూడా కానీ మంచి విష్ణు ఒక విషయంలో మాత్రం ఈసారి తన మాట నిలబెట్టుకున్నాడు అని తెలుస్తోంది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోని సభ్యులందరికీ ఉచితంగా హెల్త్ చెకప్ లు నిర్వహిస్తామని తన హామీల్లో పేర్కొన్నాడు. అలాగే హెల్త్ భీమాని కూడా అందిస్తామని తెలిపాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఆదివారం నాడు ఉచిత హెల్ప్ చెకప్ నిర్వహించారు.. కాంటినెంటల్ హాస్పిటల్స్ సహాయంతో సభ్యులందరికీ పూర్తి మాస్టర్ హెల్త్ చెకప్ ఫ్రీగా నిర్వహించారు. మంచు విష్ణు స్పందిస్తూ మాస్టర్ చెకప్ కి రూ.10,000 అవుతుంది. కానీ కాంటినెంటల్ హాస్పిటల్ వాళ్ళు మాకు ఫ్రీగా అందించారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ముందుకు వచ్చిన హాస్పిటల్ యాజమాన్యానికి థాంక్యూ అని తెలిపారు మంచు విష్ణు. ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ రూ. 3 లక్షల విలువైన హెల్త్ భీమాని కూడా ఉచితంగా అందిస్తున్నాము అంటూ తెలిపారు. మొత్తానికైతే మంచు విష్ణు ఒక్కొక్కటిగా తన కర్తవ్యాలను నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news