బన్నీ చేతుల మీదుగా మోసగాళ్ళు టీజర్ రిలీజ్..

-

మంచు విష్ణు కథానాయకుడిగా సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. తనని తాను మార్చుకుంటూ సరికొత్త కథాంశంతో ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేయడానికి మోసగాళ్ళు సినిమాతో ముందుకు వస్తున్నాడు. ప్రపంచాన్నే కుదిపేసిన అతిపెద్ద ఐటీ స్కామ్ ని మోసగాళ్ళు సినిమాలో చూపించబోతున్నాడు. ఈ స్కామ్ ఆధారంగా రూపొందిన మోసగాళ్ళు చిత్ర టీజర్ ఈ రోజే విడుదలైంది. స్టైలిష్ స్టార్ బన్నీ టీజర్ రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ కి ఆల్ ద బెస్ట్ తెలిపాడు.

32సెకన్ల టీజర్లో ముందుగా అమెరికా అధ్యక్ష్యుడు ట్రంప్, స్కాం గురించి మాట్లాడుతూ ఎలాగైనా వారిని పట్టుకుంటామని దేశానికి చెబుతున్నాడు. ఆ వెంటనే విష్ణు, కాజల్ అగర్వాల్ డబ్బులు కొట్టేసినట్లుగా కనిపిస్తారు. కాజల్, ఇది సరిపోతుందా అంటే, విష్ణు ఆటిప్పుడే మొదలైందంటూ ఇంకా చాలా కావాలన్నట్టుగా చెప్పాడు. ఇంతకుముందు చెప్పినట్టు డబ్బు చుట్టూ తిరిగే కథలాగే చూపించారు. విష్ణు సొంత నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు తమిళం, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news