మణిరత్నం ‘నవాబ్’ ట్రైలర్ వచ్చేసింది

-

సౌత్ సిని పరిశ్రమలో గొప్ప దర్శకుల పేర్ల ప్రస్థావన వస్తే తప్పకుండా మణిరత్నం పేరు వినపడుతుంది. కేవలం తమిళ సినిమాలే చేసినా అతని ప్రతిభ ఏంటో టాలీవుడ్ ఆడియెన్స్ కు తెలుసు. డబ్బింగ్ సినిమాలతోనే తెలుగులో కూడా స్టార్ డైరక్టర్ క్రేజ్ అందుకున్నాడు మణిరత్నం. కొన్నాళ్లు కెరియర్ లో చాలా వెనుకపడ్డ మణిరత్నం ఓకే కన్మణి సినిమాతో హిట్ అందుకున్నాడు.

ఆ సినిమా తర్వాత మళ్లీ కార్తితో చెలియా సినిమా చేసినా అది వర్క్ అవుట్ కాలేదు. లేటెస్ట్ గా మణిరత్నం చెక్క చివంత వానం సినిమా చేస్తున్నాడు. శింభు, ఫహాద్ ఫాజిల్, అర్వింద స్వామి లీడ్ రోల్స్ చేస్తున్నారు. జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితిరావు ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారు. కొద్ది గంటల క్రితం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సినిమా లెక్క ఏంటో ట్రైలర్ లోనే చూపించేశాడు మణిరత్నం.

ఖచ్చితంగా ఈ ట్రైలర్ చూశాక మణి సార్ ఈజ్ బ్యాక్ అనేలా ఉంది. మణిరత్నం మార్క్ ట్రైలర్ గా వచ్చిన ఈ సినిమా తెలుగులో నవాబ్ గా వస్తుంది. ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఎలాంటి హంగామా సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news