భార్య పుట్టిన రోజున మనోజ్ ఎమోషనల్ పోస్ట్..!

టాలెంటెడ్ హీరో మంచు మనోజ్ తన భార్య మౌనిక పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇటీవలే ఈ జంట పెళ్లి బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. పెళ్లి అయిన తరువాత మొదటిసారి వచ్చిన పుట్టినరోజు కావడంతో మనోజ్ ఈ రోజును చాలా స్పెషల్ డే గా అభివర్ణించారు. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ నోట్ రాసుకోచ్చారు.. ప్రియమైన మున్నిలు.. ఇవాళ నీ పుట్టినరోజు సందర్భంగా నాకు నీపై ఉన్న ప్రేమను, ఇష్టాన్ని తెలియజేయాలనుకుంటున్నా.

నా జీవితంలో ప్రేమ వెలుగులు పంచింది నువ్వే, మనల్ని ఒకటి చేసిన ఈ కాలానికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. మా జీవితాల్లోకి వెలకట్టలేనంత సంతోషాన్ని తీసుకొచ్చావు, నవ్వుల్ని పంచవు. నీ ప్రేమ, నీ కేరింగ్ మాటల్లో చెప్పలేను.   నీ మనసెంత మంచిదంటే.. నీ చుట్టూ ఉన్నవాళ్లకి నిస్వార్ధమైన ప్రేమను పంచుతావు. నా కోరిక ఒక్కటే.. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి. నీకు ఎప్పుడు మంచే జరగాలి మై లవ్. దానికోసం నేను ఏదైనా చేస్తాను. ఎంత దూరమైనా వెళ్తాను. నీ పుట్టినరోజు సందర్భంగా మనం కలిసిన మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నాను మున్నిలు హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్ వైఫ్. ధైరవ్, జోయా తో పాటు నా తరఫునుంచి నీకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అని రాసుకొచ్చారు. ప్రస్తుతం మనోజ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారంది. ఇది చూసిన మనోజ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా మౌనికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.