బన్ని.. మారుతి.. లైన్ క్లియర్

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరక్టర్ మారుతి ఇద్దరు మంచి స్నేహితులు. ఎన్నో ఏళ్లుగా ఇద్దరు స్నేహితులుగా ఉన్నాసరే బన్నితో మారుతి సినిమా చేయలేదు. ఇద్దరు కలిసి చేసే సబ్జెక్ట్ దొరకలేదు. బన్ని సోదరుడు అల్లు శిరీష్ మారుతితో కొత్త జంట చేశాడు కాని బన్ని మాత్రం మారుతికి దొరకడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నా పేరు సూర్య నిరాశపరచగా బన్ని ఆలోచనల్లో మార్పు వచ్చిందట.

ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేయబోతున్న బన్ని తన తర్వాత సినిమాను మారుతితో ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. రీసెంట్ గా స్టోరీ డిస్కషన్స్ జరిగాయట. లైన్ ఓకే చేయగా ఫుల్ స్క్రిప్ట్ లో అక్కడక్కడ మార్పులు సూచించాడట బన్ని. త్రివిక్రం తర్వాత దాదాపు మారుతి సినిమానే కన్ఫాం అవ్వొచ్చని తెలుస్తుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తారట. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో వెళ్లడిస్తారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version