రవితేజ ఖిలాడి టీజర్.. యు ఆర్ అన్ స్టాపబుల్..!

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. టీజర్ మొత్తం యాక్షన్ మోడ్ లో.. థ్రిల్ కు గురి చేయగా చివర్లో ప్లే స్మార్ట్ విత్ ఔట్ స్టుపిడ్ ఎమోషన్స్.. యు ఆర్ అన్ స్టాపబుల్ అని డైలాగ్ అదిరింది. ఈ ఇయర్ మొదట్లో క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ మరోసారి తన మాస్ ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

Mass Maharaj Raviteja Khiladi Teaser Released

టీజర్ తో సూపర్ అనిపించేసిన రవితేజ ఖిలాడిగా మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేసింది. ఖిలాడిగా మాస్ రాజా మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. మే 28 రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా టీజర్ లో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు తప్ప రిలీజ్ ఎప్పుడన్నది రివీల్ చేయలేదు. బహుశా ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.