Maya Govind: చిత్రసీమలో విషాదం..గీత రచయిత మాయా గోవింద్ కన్నుమూత

-

ప్రముఖ సినీ గీత రచయిత మాయా గోవింద్ (82) ఇక లేరు. గ‌త నాలుగు నెల‌లుగా బ్రెయిన్ ట్యూమ‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఆమె చికిత్స తీసుకుంటున్నారు. గురువారం ఉదయం హార్ట్ అటాక్‌తో ఆమె కన్నుమూసినట్లు ఆమె తనయుడు అజయ్ తెలిపారు. మాయా గోవింద్‌కు బ్రెయిన్ ట్యూమర్ తో పాటు యూరిన్ ఇన్ ఫెక్షన్, ఇతర అనారోగ్య సమస్యలున్నాయి.

ముంబైలోని తన నివాసంలో మాయా గోవింద్ కన్నుమూశారు. గుండెపోటు వలనే ఆమె చనిపోయినట్లు మాయాగోవింద్ కుమార్ మీడియాకు చెప్పారు. బ్రెయిన్ క్లాట్ ట్రీట్ మెంట్ తర్వాత ఆమె హెల్త్ బాగా క్షీణించిందని, ట్రీట్ మెంట్ తర్వాత కొంచెం సెట్ అయిందనుకుని ఇంటికి తీసుకొచ్చామని అజయ్ పేర్కొన్నారు. అయితే, గురువారం ఉదయం హార్ట్ అటాక్ వచ్చి కన్ను మూసిందని ఆమె కుమారుడు చెప్పారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చెందిన మాయా గోవింద్..దివంగ‌త రైట‌ర్, డైరెక్టర్ రామ్ గోవింద్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమె ‘ఆంఖో మే బేస్ హో తుమ్‌’, ‘మై ఖిలాడీ తూ అనారీ’ ,‘ మోర్ ఘ‌ట‌ర్ ఆయే స‌జ‌న్‌వా, గుటుర్ గుటుర్ లాంటి పాపుల‌ర్ పాట‌ల‌ను రాశారు.

మాయా గోవింద్ మృతి పట్ల బీ టౌన్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మాయా గోవింద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. మాయా గోవింద్ ఇప్పటి వరకు 350 సినిమాలకు పని చేశారు. 800కు పైగా పాట‌లు రాశారు. క‌ల్యాణ్‌జీ-ఆనంద్‌జీ, రామానంద్ సాగ‌ర్‌, బ‌ప్పీ ల‌హిరికి చాలా స‌న్నిహితంగా ఉండేవారు మాయా గోవింద్. తన తల్లి మాయా గోవింద్ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లడం పట్ల తనయుడు అజయ్ ఆవేద‌న చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news