Meeku Mathrame Chepta Review: మీకు మాత్ర‌మే చెప్తా సినిమా రివ్యూ

-

టాలీవుడ్‌లో ఇదొక వినూత్న ప్ర‌యోగం.. పెళ్లిచూపుల కాంబో ఇందుకు శ్రీ‌కారం చుట్టింది. ద‌ర్శ‌కుడు త‌రుణ్‌భాస్క‌ర్‌ హీరోగా.. హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ నిర్మాత‌గా మారి తెర‌కెక్కించిన చిత్రం మీకు మాత్ర‌మే చెప్తా.  ఈసినిమా హీరోగా ఎంట్రీ ఇచ్చిన త‌రుణ్‌భాస్క‌ర్‌కు, నిర్మాత‌గా మారిన విజ‌య్ కెరీర్‌కు కీల‌క‌మే. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అభినవ్ గోమఠం కీల‌క‌ పాత్రల్లో న‌టించారు. ఇక ఈ సినిమాకు నూతన దర్శకుదు షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహించారు. అయితే.. ఈ క్రేజీ కాంబోలో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. అయితే.. ఈ సినిమా ఏమ‌ర‌కు ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..

కథలోకి వెళ్దాం…
ఇక క‌థ విష‌యానికి వ‌ద్దాం..  రాకేశ్‌ (తరుణ్ భాస్కర్) శాంతిని (వాణి భోజన్)ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంటాడు. ఈక్ర‌మంలో అనుకోకుండా.. రాకేశ్‌ ఫోన్ కి ఓ వీడియో వస్తోంది. ఆ వీడియో రాకేశ్ కు సంబంధించిన వ్య‌క్తిగ‌త‌ వీడియో. అయితే.. ఆ వీడియోతో రాకేశ్ తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతాడు. అది బ‌య‌ట‌కు వ‌స్తే.. ఇక త‌న పెళ్లి ఎక్క‌డ ఆగిపోతుందోన‌ని భ‌య‌ప‌డిన రాకేశ్‌.. దానిని ఆప‌డానికి నానాతంటాలు ప‌డుతాడు. హీరోయిన్‌ శాంతికి తెలియ‌కుండా ఉంచ‌డానికి స్నేహితుల‌తో క‌లిసి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. అయితే.. ఆ వీడియోను బ‌య‌ట‌కు రాకుండా చేస్తారు. అయినా.. మ‌ళ్లీ వీడియో బ‌య‌ట‌కు వ‌స్తుంది.. అది ఎలా వ‌చ్చింది..? ఎవ‌రు పంపారు..? ఎందుకు పంపారు.. దీని వెనుక ఎవ‌రున్నారు..?   చివ‌ర‌కు హీరోయ్‌ను పెళ్లి చేసుకుంటాడా..? ఇలా అనేక ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌ను తెర‌పైనే చూడాలి మ‌రి.

క‌థా విశ్లేష‌ణ‌
చాలా హాస్య‌భ‌రిత స‌న్నివేశాల‌తో సినిమా హాయిగా ముందుకు వెళ్తుంది. ద‌ర్శ‌కుడు తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా సినిమాను తెర‌కెక్కించ‌డంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్పొచ్చు. అయితే.. అక్క‌డ‌క్క‌డ క‌థాగ‌మ‌నం స్లోగా ఉన్నా.. ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా బోర్ అనిపించ‌దు. ఇదే స‌మ‌యంలో కొన్నికొన్ని సీన్లు మాత్రం బాగా ఆక‌ట్టుకుంటాయి. ఇందులో ప్ర‌ధానంగా తరుణ్ భాస్కర్ కి సంబంధించిన వీడియో బయట పడిన‌ప్ప‌టి నుంచి సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. తరుణ్ భాస్కర్, అతని ఫ్రెండ్స్ మరియు మిగిలిన కీలక పాత్రలకు మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్ష‌కుల‌ను బాగా న‌వ్విస్తాయి. ఇలా సినిమా మొత్తం ప‌లు ఇంట్రెస్టింగ్ మలుపుల‌తో ముందుకు సాగుతుంది. ఇక‌, అనసూయ రోల్ కి సంబంధించిన ట్విస్ట్, అదేవిధంగా ఆ వీడియోకి సంబంధించిన ట్విస్ట్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది.

న‌టీన‌టులు…
ఈ సినిమాలో ప్ర‌తీ పాత్ర కీల‌క‌మ‌నే చెప్పొచ్చు. న‌టీన‌టులంద‌రూ త‌మ‌పాత్ర‌ల‌కు పూర్తిగా న్యాయం చేశారు. ప్ర‌ధానంగా హీరో త‌రుణ్‌భాస్క‌ర్ న‌ట‌న సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఎక్క‌డ కూడా త‌డ‌బాటు లేకుండా త‌రుణ్‌భాస్క‌ర్‌ న‌టించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఇక హీరోయిన్ వాణి భోజ‌న్‌ కూడా త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసింద‌ని చెప్పొచ్చు. ప‌లు సీన్ల‌లో ఆమె క‌నిపించిన తీరు సూప‌ర్బ్ అని చెప్పొచ్చు. మ‌రో న‌టీమ‌ణి అన‌సూయ కూడా త‌న పాత్ర‌తో సినిమాకు మ‌రింత బలాన్ని ఇచ్చింది. మొత్తంగా త‌రుణ్‌, అభిన‌వ్‌, అన‌సూయ త‌మ న‌ట‌న సినిమాకు ప్ర‌ధాన బ‌లం. మొత్తంగా త‌రుణ్‌భాస్క‌ర్‌, విజ‌య్‌దేవ‌ర‌కొండ చేసిన వినూత్న ప్ర‌యోగం చాలా వ‌ర‌కు మంచి ఫ‌లితాన్ని ఇచ్చింద‌ని చెప్పొచ్చు

మీకు మాత్ర‌మే చెప్తా రివ్యూ రేటింగ్‌: 2.75/ 5

Read more RELATED
Recommended to you

Latest news