చిరంజీవి బర్త్ డే కోసం..వంద మంది సెలబ్రిటీలతో !

-

ఒకప్పుడు హీరోల పుట్టినరోజులు అంటే కేక్ కటింగ్స్, రక్తదాన శిబిరాలు, ఆసుపత్రుల్లో పళ్ళు పంచడం లాంటివి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అవి చేస్తూనే తమ అభిమాన హీరో కామన్ డీపీలు పెట్టి, వాళ్ళ పేరిట ట్రెండ్స్ క్రియేట్ చేసి మరీ రికార్డులు సృష్టిస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. లాక్ డౌన్ పుణ్యమా అని మహేష్, పవన్ ఫ్యాన్స్ కూడా ఎంటర్ కావడంతో ఈ రికార్డుల వేట రంజుగా మారింది.

ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ పుట్టిన రోజు దగ్గరకు రావడంతో మరింత కొత్తగా ప్లాన్ చేశారు అయన అభిమానులు. భారత దేశ చరిత్రలో మునుపెవ్వరూ చేయని విధంగా తమ అభిమాన హీరోకి వాళ్ళు ట్రిబ్యూట్ ఇవ్వబోతున్నారు. ఆయన 65వ పుట్టిన రోజు సందర్భంగా వంద మంది ఇండియన్ టాప్ సెలబ్రిటీలతో మెగా కామన్ పోస్టర్ లాంచ్ చేయనున్నారు. ఆయన పుట్టినరోజుకు ఒక్క రోజు ముందు అంటే 21 ఆగస్ట్ రాత్రి ఏడుగంటలకు ఈ లాంచ్ ఉంటుంది. చూడాలి మెగా ఫ్యాన్స్ ఎన్ని రికార్డులు బద్దలు కొడతారో ?

Read more RELATED
Recommended to you

Latest news