హాస్పిటల్స్ కరోనా దందా మీద కేంద్రం ఆరా…విచారణకు అదేశాలు !

-

కరోనా సమయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపీడీ మామూలుగా లేదు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లోని హాస్పిటల్స్ అయితే ఐదు లక్షలు ఉంటే కానీ బెడ్ దొరకని పరిస్థితి. ఇన్నాళ్ళూ బిజినెస్ లేక ఖాళీగా ఉన్నామని ఫీలవుతున్న యాజమాన్యాలు కరోనా పేషెంట్స్ ని తమకు దొరికిన బంగారు బాతుల్లా ఫీలవుతున్నాయి. ప్రభుత్వం ఒక రేటు ఫిక్స్ చేసినా, దానికి ఐదింతలు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ గా ఉన్నామని చెబుతున్నా వాటి పని అవి చేసుకుపోతున్నాయి. తాజాగా కరోనా కార్పొరేట్ దందా మీద కేంద్రం సీరియస్ అయింది. హైదరాబాద్ లోని మూడు ప్రయివేట్ ఆస్పత్రుల దోపిడీ పై విచారణకు అదేశాలు జారీ చేసింది. కరోనా రోగుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారంటూ, నేషనల్ ఫార్మాస్యూటికెల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదులు అందాయి. దీంతో యశోద, కేర్, మెడి కవర్ ఆస్పత్రుల పై విచారణ చేయనున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది. హైదరాబాద్ సామాజిక వేత్త విజయ్ ఫిర్యాదుపై కేంద్రం స్పందించి ఈ విచారణకు అదేశాలు జారీ చేసింది,.

Read more RELATED
Recommended to you

Latest news