చిరు.. ఆమీర్.. వాటే పిక్..!

-

బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది. ఏంటి కొంపదీసి వారిద్దరు కలిసి సినిమా చేస్తున్నారా ఏంటని ఆశ్చర్యపోవచ్చు. అలాంటిదేమి లేదు కాని ఇద్దరు జస్ట్ కలిశారు అంతే.. సైరాకి చిన్న బ్రేక్ ఇచ్చిన చిరు జపాన్ ట్రిప్ వెళ్లారు. అక్కడ క్యోటో ఎయిర్ పోర్ట్ లో చిరుని చూసిన ఆమీర్ ఖాన్ దగ్గరకు వచ్చి పలుకరించాడట. అక్కడ ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించి ఫోటో దిగారు.

ఆ ఫోటోని ఆమీర్ ఖాన్ తన సోషల్ బ్లాగ్స్ లో పెట్టుకున్నాడట. చిరు, ఆమీర్ కలిసి దిగిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంత పెద్ద స్టార్ అయినా సరే చిరు మీద తన అభిమానం చూపించిన ఆమీర్ ను చూసి మెగా ఫ్యాన్స్ కూడా మెచ్చుకుంటున్నారు. అయితే ఇద్దరు కలిసి దిగిన ఫోటోనే ఇలా ఉంటే ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో అని అంటున్నారు. మరి అది సాధ్యపడే విషయమేనా అని చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version