అకీరా నందన్ కి బర్త్ డే విషెస్ చెప్పిన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి ..!

-

మెగా కుటుంబం అంటే ఇండస్ట్రీలో అందరికి ప్రత్యేకమైన అభిమానం అన్న సంగతి తెలిసందే. అంతేకాదు మెగా ఫ్యామిలీ మీద మెగా ఫ్యాన్స్ కి విపరీతమైన అభిమానం. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు 10 మంది హీరోలు వచ్చి స్టార్స్ గా వెలుగుతున్నారు. అయినా మెగా ఫ్యాన్స్ మరో కుర్రాడు మెగా హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అంటూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ కుర్రాడే అకీరా నందన్.

 

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రేణు దేశాయ్ దంపతుల తనయుడు అకీరా నందన్ అన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి ఎంతో ఇష్టమైన ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్, పేయింటర్ అయిన అకీరా కురసోవా పేరునే తన కొడుకు కి అకీరా నందన్ గా పెట్టుకున్నారు. ఇక మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు ఈ రోజు అకీరా నందన్ పుట్టిన రోజు కూడా కావడం విశేషం. ఈ నేపథ్యంలో తన తమ్ముడు పవన్ కల్యాణ్ కొడుకు అకీరా పుట్టిన రోజును గుర్తు పెట్టుకుని మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ – ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు. అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి. నీకు ‘పవర్’ ఫుల్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే అకీరా’ అంటూ తన ఆశీస్సులు అందించారు.

ఇక చిరంజీవి ‘పవర్’ అనే పదాన్ని ప్రత్యేకంగా గా వాడడంతో మెగా అభిమానులతో పాటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఇక త్వరలో అకీరా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడని సమాచారం. ఇందుకు తగిన శిక్షణ కూడా తీసుకొని అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నాడని ఇంతకముందే రేణు దేశాయ్ క్లారిటి ఇచ్చారు. దాదాపుగా అకీరా ఎంట్రీ 2021 లోపు ఉంటుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version